Arjun Kapoor: ఆ వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్.. రాత్రిళ్లు అలా చేసేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |
Arjun Kapoor: ఆ వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్.. రాత్రిళ్లు అలా చేసేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) విలన్‌గా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రజెంట్ అర్జున్ కపూర్ ‘సింగం అగైన్’(Singham Again) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనకు ఓ వ్యాధి ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘సింగం అగైన్ మూవీ షూట్ చేసినప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. శారీరకంగా, మానసికంగా అన్ని కోణాల్లోనూ బాధలో కూరుకుపోయాను.

డైరెక్టర్ రోహిత్ శెట్టి(Rohit Shetty) నా లుక్ మార్చుకునేందుకు కొంత టైమ్ ఇచ్చాడు. అప్పటికే సినిమాపై నాకు ప్రేమ పోయింది. దీంతో అసలు ‘సింగం అగైన్’(Singham Again) చేయాలా వద్దా మళ్లీ సినిమాలతో ప్రేమలో పడాలా? నన్ను జనాలు ఆదరిస్తారా?లేదా అనే అనుమానం ఉండేది. నేను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడిని. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడిని.

నిద్ర రావడానికి రాత్రిళ్లు యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చూసేవాడిని. గత ఏడాది నేను డిప్రెషన్ నుంచి బయటపడేందుకు థెరపీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు హషిమోటో(Hashimoto's disease) అనే వ్యాధి ఉంది. ఇది మా అమ్మకు, సోదరి అన్షులాకు కూడా ఉంది. ఈ వ్యాధి వల్ల బరువు అదుపులో ఉండేది కాదు. ఇది థైరాయిడ్ వ్యాధి(Thyroid disease) గ్రంధిని డ్యామేజ్ చేస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ అర్జున్ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story