- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : అయ్యా సంబరాల రాంబాబు.. సీఎం పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: (Musi Yatra) మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా (KTR) కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రి పాలన తీరు అని విమర్శించారు. (Hyderabad) హైదరాబాద్లో మూసీ బాధితులు ఉంటే.. నల్గొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లెక్కడ - కాలిన కడుపులెక్కడ - నువ్వు తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ? ఆగిన గుండెలెక్కడ - రగిలిన మనసులెక్కడ.. నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ - నువ్వు చేస్తున్న పాదయాత్ర ఎక్కడ? నీ కుట్రలకు అంబర్ పేట్ - అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే - నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ? అని నిలదీశారు.
నీ మూసీ దాహానికి అత్తాపూర్ ఆగమైంది, గోల్నాక గొల్లుమంటోంది, దిల్షుక్ నగర్ ఢీలా పడ్డదన్నారు. అయ్యా సంబరాల రాంబాబు నీ అన్యాయానికి.. ఆవేదనలు, ఆవేశాలు, అక్రాందనాలు వినిపిస్తున్నవి కనిపిస్తున్నవి అక్కడ కాదు రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర అని సెటైర్లు వేశారు. తేలు మంత్రం రానోడు.. పాము కాటుకు మంత్రం వేసినట్లు.. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్.. నాయకత్వం అంటే కూల్చడం కాదు.. నిర్మించడం, నాయకత్వం అంటే తొవ్వ తప్పడం కాదు.. తొవ్వ చూపడం అని కేటీఆర్ ట్వీట్ చేశారు.