తెలంగాణలో కులగణన కాంగ్రెస్ రాజకీయ స్టంట్‌: ఎంపీ లక్ష్మణ్

by Mahesh |
తెలంగాణలో కులగణన కాంగ్రెస్ రాజకీయ స్టంట్‌: ఎంపీ లక్ష్మణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంభ సర్వే(Comprehensive Household Survey) పేరుతో.. కుల గణన(Cast Census) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్(MP Laxman) కులగణన పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తాత ముత్తాతలు బీసీలకు అన్యాయం చేశారని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశంలోని బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన ఓ పొలిటికల్ స్టంట్(political stunt) మాత్రమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఇచ్చిన హామీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బిహార్‌లో కులగణన చేసిన ఘనత ఎన్డీయే(NDA) కూటమిదని, బిహార్‌లో బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed