Aligarh Muslim Unversity: అలీగఢ్ యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఉండాలా? వద్దా?

by Shamantha N |
Aligarh Muslim Unversity: అలీగఢ్ యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఉండాలా? వద్దా?
X

దిశ, నేషనల్ బ్యూరో: అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (Aligarh Muslim Unversity)కి మైనార్టీ హోదా విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. 2006 నాటి అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త బెంచ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది.

అలహాబాద్ హైకోర్టు

ఇకపోతే, 1967లో అజీజ్ బాషా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో భాగంగా అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని (AMU) కేంద్ర వర్సిటీగా పేర్కొంటూ అప్పటి ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అందువల్ల, దాన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమని గతంలో వెల్లడించింది. కానీ, 1981లో ఏఎంయూ(Aligarh Muslim University) సవరణ చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించడంతో ఏఎంయూకి మళ్లీ మైనార్టీ హోదా (Minority Status) లభించింది. అయితే, ఈ చట్ట సవరణను సవాల్ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఏఎంయూ కు మైనార్టీ హోదా కల్పించే 1981 చట్ట నిబంధనను కొట్టివేస్తూ 2006 జనవరిలో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed