HYDRAA : బెంగళూరులో ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’తో హైడ్రా కమిషనర్ చెరువుల సందర్శన

by Ramesh N |
HYDRAA : బెంగళూరులో ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’తో హైడ్రా కమిషనర్ చెరువుల సందర్శన
X

దిశ, డైనమిక్ బ్యూరో: (HYDRAA) హైడ్రా బృందం బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ పై అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులో రెండో రోజు పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్, అధికారుల బృందం (Doddathoguru Lake) దోద్దతోగురు సరస్సును సందర్శించింది. (Lake Man of India) లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్‌ మల్లిగవాడ్‌‌తో లేక్‌ను కమిషనర్ సందర్శించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) మాట్లాడుతూ.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ లోని దొడ్డతొగురు చెరువు సందర్శనకు వెళ్లామన్నారు. దీన్ని లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి గాంచిన ఆనంద్‌ మల్లిగవాడ్‌ ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల స్పాన్సర్‌షిప్‌తో 44 ఎకరాల దొడ్డతొగురు చెరువుని చాలా అధ్భుతంగా అభివృద్ధి చేశారని వెల్లడించారు.

చెరువులోకి వచ్చే మురికి నీళ్లను బయోలాజికల్ పద్ధతిలో శుద్ధి చేయడం, ఆ నీటిని పార్క్‌లో వాడుతారని తెలిపారు. అదేవిధంగా వర్షపు నీటిని చెరువులో నిల్వ ఉంచుతారని, దాదాపు బీ లేదా సీ టైప్ క్వాలిటీ వాటర్ ఇక్కడ చూశామని వివరించారు. ఇందులో ఆక్వాటిక్ లైఫ్.. చేపలు, బాతులు జీవిస్తున్నాయని, ఇవి ఉన్నాయంటే ఆ చెరువులో పొల్యూషన్ తక్కువగా ఉన్నట్లు భావించాలన్నారు. ఆనంద్‌ మల్లిగవాడ్‌ వారి ఫౌండేషన్ ద్వారా గతంలోనే (Hyderabad) హైదరాబాద్‌లో కొన్ని చెరువుల ప్రక్షాళన చేశారని, రాష్ట్ర ప్రభుత్వం తరపున త్వరలో చెరువుల పునరుద్దరణపై వారి సేవలు పూర్తిగా వినియోగించుకుంటామని వెల్లడించారు.

Advertisement

Next Story