- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
దిశ, గంగాధర : మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని శుక్రవారం సభలో కలెక్టర్ సత్పతి అన్నారు. శుక్రవారం సభను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గంగాధర మండలంలోని పెద్ద ఆచంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భవతులకు, బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి సూచించారు. ఆరోగ్య మహిళ ప్రోగ్రాంకు మహిళలందరూ తప్పక రావాలన్నారు. తల్లులు పిల్లలు ఎవరూ కూడా రక్తహీనతకు గురికాకుండా ఉండాలని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, ఖర్జూరం, బెల్లం, పల్లీలు, నువ్వులు మొదలైన బలమైన పోషకాహారం తీసుకోవాలన్నారు.
అంగన్వాడీ సెంటర్లకు, ప్రభుత్వ పాఠశాలలకు, పిల్లలందరినీ పంపించాలని, ప్రైవేటు హాస్పిటల్ లకు ఎవరూ వెళ్లకూడదని, ప్రతి గర్భవతి ప్రభుత్వ హాస్పిటల్లోనే డెలివరీ కావాలని కలెక్టర్ కోరారు. మాతా శిశు దావఖానలోనే నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మంచి పోషకాహారం తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గర్భిఫులకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించి వారికి చీర, గాజులు అందించారు. అనంతరం ప్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీడబ్ల్యూ ఓ సరస్వతి, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, డీఎంహెచ్వో, సీడీపీఓ కస్తూరి, ఎంపీడీఓ రాము, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైసర్ రేణుక, స్కూల్ టీచర్స్, విలేజ్ సెక్రటరీ స్వప్న, అంగన్వాడీ టీచర్లు జమున, లలిత తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.