- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SAI Jobs: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హత, జీతం పూర్తి వివరాలివే..!
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ(Delhi)లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 50 యంగ్ ప్రొఫెషనల్(Young Professional) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://sportsauthorityofindia.nic.in/sai/ ద్వారా ఆన్లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. అప్లై చేసుకోడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
యంగ్ ప్రొఫెషనల్(Young Professional) - 50
విద్యార్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, బీఈ, బీటెక్, ఎంబీబీస్ ఉతీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు జీతం ఉంటుంది.