Cm Revanth Reddy: ప్రభుత్వ హాస్టళ్ల బాధ్యతలపై కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2025-01-01 16:08:34.0  )
Cm Revanth Reddy: ప్రభుత్వ హాస్టళ్ల బాధ్యతలపై కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ హాస్టళ్లు(Government Hostels) అధ్వాన్నంగా మారిన విషయం తెలిసిందే. హాస్టళ్ల గదులు, మౌలిక వసతులు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల హాస్టళ్లకు కిటికీలు సైతం లేవు. చలికాలంలో గజగజ వణుకుతూనే విద్యార్థులు(Students) నిద్ర పోవాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘనలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల మెస్ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. హాస్టళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్ల(Collectors)కు అప్పగించింది. బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్‌ అధికారులు(Women IAS officers) నిద్ర చేయాలని ఆదేశించింది. అలాగే వసతులపై నివేదిక ఇవ్వాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed