ఏవీడీ కంపెనీపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. బాత్రూమ్ పక్కనే స్వీట్స్, స్నాక్స్ తయారీ

by Rani Yarlagadda |
ఏవీడీ కంపెనీపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. బాత్రూమ్ పక్కనే స్వీట్స్, స్నాక్స్ తయారీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఎక్కడ ఫుడ్ తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఎక్కడ చూసినా.. నాణ్యత లేని ఆహారమే దర్శనమిస్తోంది. ఎక్స్పైర్ అయిన పదార్థాలతో ఆహారాలను తయారు చేసి.. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసిన ప్రతీ రెస్టారెంట్, ప్రతీ హోటల్ లో కుళ్లిన మాంసాహారం, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లు, బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి.


తాజాగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఉప్పల్ శాంతినగర్లోని ఏవీడీ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించగా.. నాసిరకమైన సరుకులతో అత్యంత దారుణంగా స్వీట్స్, స్నాక్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఐదున్నర టన్నుల కారాబూందీ, స్వీట్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. నాణ్యతలేని నూనెతో వాటిని తయారు చేసినట్లు గుర్తించారు. ఏవీడీ కంపెనీ నుంచి సిటీలో వందలాది బేకరీలు, షాపులకు, స్వీట్లు, స్నాక్స్ పంపిణీ చేస్తుంటారు. అలాంటి చోట అతి దారుణమైన పరిస్థితులు కనిపించడంతో అంతా షాకయ్యారు.


ఎలాంటి మానుఫ్యాక్చరింగ్ డీటైల్స్ లేకుండా ఏవీడీ కంపెనీ తమ ఫుడ్స్ ను సప్లై చేస్తున్నట్లు తెలియడంతో.. ఆ లొకేషన్ ను గుర్తించి దాడిచేసినట్లు ఫుడ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీకాంత్ తెలిపారు. వర్కర్స్ హైజెనిక్ గా లేరని, సేఫ్టీ ప్రికాషన్స్ లేవని, బాత్రూమ్ల పక్కనే స్వీట్స్, స్నాక్స్ తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాటి శాంపుల్స్ ను ల్యాబ్స్ కు పంపామని, ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed