Viral Video: హిందూ దేవుళ్లే టార్గెట్‌గా మరోసారి బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-01-05 12:51:14.0  )
Viral Video: హిందూ దేవుళ్లే టార్గెట్‌గా మరోసారి బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హిందు దేవుళ్లే(Hindu gods) టార్గెట్ గా మరోసారి బైరి నరేష్(Bairi Naresh) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాస్తికుడిగా, సామాజిక కార్యకర్తగా(An Atheist, Social Activist) ఉన్న బైరి నరేష్ గతంలో హిందు దేవుళ్లు అయిన రాముడు(Ram), అయ్యప్ప స్వామి(Ayyappa Swamy)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహానికి గురైన వరంగల్‌(Warangal)లోని హిందూ సామాజిక కార్యకర్తలు, అయ్యప్ప మాలదారులు బైరి నరేష్ కు దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అయితే ఇదే తరహాలో ఓ సభలో మాట్లాడుతూ.. మరోసారి హిందూ దేవుళ్లను కించపరిచారు. అంతేగాక ఓ వర్గాన్ని అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. పోలీసులు చర్యలు(police take action) తీసుకోవాలని కోరుతున్నారు. అంతేగాక ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోతోందని, సినిమాలను, కొందరు వ్యక్తులను ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని ఇలా తయారు అవుతున్నారని, ఇలాంటి వాళ్లను కట్టడి చేసేందుకు ఏదో ఒకటి చేయాలని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story