Medigadda Barrage :మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఆ ఇద్దరికి చార్జీ మోమోలు

by Y. Venkata Narasimha Reddy |
Medigadda Barrage :మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఆ ఇద్దరికి చార్జీ మోమోలు
X

దిశ, వెబ్ డెస్క్ : మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిపోయిన ఘటన(Collapse Incident)లో రాష్ట్ర ప్రభుత్వం(State Government)కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ పనులు పూర్తికాకముందే పూర్తి అయినట్లుగా నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీకి కంప్లీషన్​సర్టిఫికెట్ (సీసీ)​ ఇచ్చిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కంప్లీషన్​సర్టిఫికెట్ జారీ చేసిన ఎస్‌ఈ(SE), ఈఈ(EE)లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో ఎస్ఈగా బీ.వి. రమణా రెడ్డి, ఈఈగా తిరుపతిరావు పనిచేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆ ఇద్దరికి ఇరిగేషన్​ శాఖ సెక్రటరీ రాహుల్​ బొజ్జా చార్జ్​మెమో(Charge Memos Issued)లు జారీ చేశారు. విధినిర్వహణలో నిర్లక్యంగా వ్యవహరించడం, నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్న కారణాలతో ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై 10 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని అంతేకాకుండా వ్యక్తిగతంగా వచ్చి విచారణ అధికారులకు వివరణ డాక్యుమెంట్లను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఒకవేళ గడువు సమయంలోపు వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ 2016 నవంబరులో మొదలుపెట్టి 2019లో పూర్తి చేసింది. బ్యారేజీ ప్రారంభించిన తర్వాత తొలి వరదలకే సీసీ బ్లాకులు చెల్లాచెదురు కావడంతో పాటు బ్యారేజీ ఎగువ, దిగువభాగంలోని అఫ్రాన్లు దెబ్బతిన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ చేపట్టిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ పనులు పూర్తవకున్నా.. అయినట్లుగా ఎలా సర్టిఫికెట్‌ ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది.

మరోవైపు అధికారుల తీరును విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా తప్పుపట్టింది. దీంతో గత జూన్‌ 3నప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌ లేఖ రాస్తూ.. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఈఈ తిరుపతిరావుతో పాటు దానిపై సంతకం చేసిన రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయన అధికారుల వివరాలతో కూడిన నివేదిక అందజేశారు. దాని ఆధారంగా వీరిద్దరిపై అభియోగాలు నమోదు చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా జీవో నంబరు 1, 2లు జారీ చేశారు. ఇంజనీర్లకు​మెమోలు జారీ చేసింది. తదుపరి దశలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా మెమోలు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. ప్రస్తుతం మేడిగడ్డ కుంగుబాటు అంశంపై జస్టీస్ పీసీ.ఘోష్ ఆధ్వర్యంలో జ్యుడీషియల్ విచారణ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed