గంజాయి సేవిస్తున్న 25 మందిపై కేసులు నమోదు

by Sridhar Babu |
గంజాయి సేవిస్తున్న 25 మందిపై కేసులు నమోదు
X

దిశ, తిరుమలగిరి : హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి సేవిస్తున్న వారిని, బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజలు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే నార్త్ జోన్ డీసీపీని కలిశారు.

నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అందులో బాగంగానే డీసీపీ 5 టీంలను ఏర్పాటు చేసి కృష్ణానగర్ 2 బీహెచ్ కే ఏరియాలో, రసూల్ పుర, శ్రీలంక బస్తి, అర్జున్ నగర్, బాలంరాయిలలో 85 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో గంజాయి సేవిస్తున్న 20 మందిని, బహిరంగంగా మద్యం సేవిస్తున్న 25 మందిని, అదే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 10 మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story