- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత
దిశ, కామారెడ్డి : దివ్యాంగులకు,అంధులకు ప్రభుత్వం చేయూత నిస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అంధుల కోసం లూయీ బ్రేల్ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రధాత అని అన్నారు. శనివారం కలెక్టరేట్ లో లూయీ బ్రెల్ 216వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా..ఆయన చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...అంధులు విద్యను అభ్యాసించుటకు బ్రెయిలీలో అక్షరాలను కనుగొన్న వ్యక్తి అని అన్నారు. ఎన్నికల్లో అంధులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ ను కూడా ఎన్నికల కమీషన్ ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా గ్రంధాలయం ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం తెలంగాణా రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ వారిచే బ్రెయిలీ లిపిలో ప్రచురించబడిన బ్రేల్ క్యాలెండర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సి.డి.పి.ఒ. రోచిష్మ , దివ్యంగుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.