కొలెస్ట్రాల్‌పై అపోహల్లో నిజమెంత..?

by Kanadam.Hamsa lekha |
కొలెస్ట్రాల్‌పై అపోహల్లో నిజమెంత..?
X

దిశ, ఫీచర్స్: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందంటే చాలా మంది భయపడుతుంటారు. ఇది గుండెకు ప్రమాదమని, ఎలాగైనా దీనిని తగ్గించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కొలెస్ట్రాల్ అంటే శరీరంలో మైన రూపంలో ఉండే కొవ్వు పదార్ధం. ఇది శరీరంలోని మెదడు నుంచి ప్రతి కణంలో ఉంటుంది. శరీర కణాలకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. కార్బన్‌ డై ఆక్సైడ్, వ్యర్ధాలు, మలినాలను దేహం నుంచి బయటక పంపించడంలో సహాయపడుతుంది. కానీ, ఎక్కువ కొలెస్ట్రాల్ గుండెకు హానికరం.

కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండవది చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్‌ను HDL అని, చెడు కొలెస్ట్రాల్‌ను LDL అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్‌ రక్తనాళాలలో అడ్డుపడి రక్తాన్ని గుండెకు చేరకుండా చేస్తుంది. దీని వల్ల గుండెపోటు వస్తుంది. అంతేకాకుండా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, స్టోక్ వంటి ఇతర ప్రాణాంతక సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని ఈస్ట్రోజన్, కార్టిజాల్, టెస్టోస్టిరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ స్ట్రోజన్ హర్మోన్ స్త్రీలలో సంతాపోత్పత్తికి అవసరమైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. కొలెస్ట్రాల్ ఎముకలను ధృఢంగా ఉంచడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా గుండె సమస్యలు, శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు, వాపురావడం కనిపిస్తుంది. అంతేకాకుండా భుజాల్లో, కాళ్లలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి నిద్రపోయే సమయంలో అధికంగా బాధపెడుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం ప్రధాన కారణం. అయితే, ఈ సమస్య ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లలోపు వారిలో కూడా కనిపిస్తుంది. ఈ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయాలంటే ఉదయం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పండ్లు తినడం, తగినంతగా నిద్రపోవడం, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed