- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నేషనల్ హైవే ఆథారిటీ కూలీపైకి దూసుకేళ్లిన డీసీఎం…అక్కడిక్కడే వ్యక్తి మృతి
దిశ, అందోల్: నాందేడ్–ఆకోలా 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అందోలు మండలం నాదులాపూర్ గ్రామానికి చెందిన తలారి కిష్టయ్య (50)ను అల్మాయిపేట వద్ద జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేషనల్ హైవే ఆథారిటీలో కూలీగా పనిచేస్తున్న కిష్టయ్య శుక్రవారం రహదారి డివైడర్ మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తుండగా, పిట్లం నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అతడి పైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రగాయాలైన కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తలారి కిష్టయ్య కళ్ల ముందే మృతి చెందడం పట్ల తోటి కూలీలు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫీక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కిష్టయ్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో జోగిపేట ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. గ్రామంలో విషాధ చాయాలు అలుముకున్నాయి.