- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
దిశ,నడిగూడెం: తమది రైతుపక్షపాత ప్రభుత్వ మని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వల్లాపురం,సిరిపురం,కాగిత రామచంద్రాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సహాయ సహకారాలను అందిస్తానన్నారు. పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. నడిగూడెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో.. వల్లాపురంలో రూ. 39.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఎరువుల గోడౌను ప్రారంభించారు. అనంతరం సిరిపురం గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి నూతన పాలకమండలి సభ్యులచే ఎమ్మెల్యే సమక్షంలో ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ వినతి పత్రం అందించారు. పాఠశాలలో నెలతమది రైతుపక్షపాత ప్రభుత్వ మని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేర్కొన్నారు.కొన్న సమస్యలపై పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కాగిత రామచంద్రపురం గ్రామంలో డబల్ బెడ్ రూమ్ కాలనీకి 25 కెవి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను, పీఏసీఎస్ ఆధ్వర్యంలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే , బీసీ కాలనీ లో చేపట్టే సిసి రోడ్డు ,ఎస్సీ కాలనీలో పాఠశాలు రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించే అంగన్ వాడీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిఒ పద్మ, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, మండల తాసిల్దార్ సరిత, నడిగూడెం ఎండిఓ సయ్యద్ ఇమామ్, ఎంపీఓ విజయకుమారి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లావణ్య, ఏపి ఎం రామలక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, నడిగూడెం, కేఆర్సీ పురం పిఎస్ఈఎస్ చైర్మన్లు కొల్లు రామారావు, చైర్మన్ గోసుల రాజేష్, మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి, మాజీ జెడ్పిటిసి బాణాల కవిత, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేపూరి తిరుపతమ్మ సుధీర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు దున్న శ్రీనివాస్, గడ్డం మల్లేష్, సురేందర్ రెడ్డి, శెట్టి సతీష్, చిన్న గుండు శ్రీను, బిక్షపతి, గుర్రం నీలిమ గాంధీ, ముదిరెడ్డి నళిని, గుజ్జ అంజి, దేవబత్తిని రమేష్, కిన్నెర నాగయ్య, పాలడుగు ప్రసాద్, కాసాని వెంకన్న, అట్టూరి నాగేందర్ రెడ్డి, పుట్టా రమేష్, నాగిరెడ్డి వీరారెడ్డి, నాగిరెడ్డి లింగారెడ్డి, మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.