- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maruti Suzuki: 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి మారుతీ సుజుకి కారు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త డిజైర్ అరుదైన రికార్డును సాధించింది. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాషింగ్ టెస్ట్ కోసం పంపిన ఈ కారు 5 స్టార్ రేటింగ్‌ని దక్కించుకుంది. పెద్దల భద్రతకు సంబంధించి 5 స్టార్, పిల్లల భద్రతలో 4 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకున్న తొలి మారుతీ సుజుకి కారుగా కొత్త డిజైర్ నిలిచింది. ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ ప్రమాణాలతో రూపొందించబడింది. అనేక సంవత్సరాలుగా భద్రతా ప్రమాణాల్లో మారుతీ సుజుకి కార్లపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో కొత్త కారును కంపెనీయే స్వయంగా క్రాష్ టెస్ట్‌కు పంపడం విశేషం. బయటా, వెలుపలా కొత్త డిజైర్‌లో అనేక మార్పులు చేసిన మారుతీ సుజుకి భద్రతలో 5 స్టార్ రేటింగ్ సాధించడంతో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ మోడల్ కోసం బుకింగ్‌లు ప్రారంభించిన కంపెనీ నవంబర్ 11న ధరతో పాటు ఇతర వివరాలను వెల్లడించనుంది.