- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(శుక్రవారం) మళ్లీ నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడంతో పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(FII) తమ నిధులను ఉపసంహరించుకోవడం మన బెంచ్ మార్క్ సూచీలను పడేశాయి. ముఖ్యంగా ఈ రోజు రిలయన్స్(Relliance), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) షేర్ల అమ్మకాలు ఒత్తిడికి గురవ్వడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 79,611.90 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 79,117.37 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 55.47 పాయింట్ల నష్టంతో 79,486.32 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 55.15 పాయింట్లు తగ్గి 24,148 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.63 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.37 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్
నష్టపోయిన షేర్లు : ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్