- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Telangana:‘సామాజిక వివక్ష రూపుమాపేందుకు ‘సర్వే’ దోహదం’.. మాజీ ఎంపీ వీహెచ్ కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో ప్రభుత్వం(TG Government) చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(comprehensive household household survey) సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు(Former MP V. Hanumantha Rao) పేర్కొన్నారు. సమ గ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైన నేపథ్యంలో.. బాగ్‌అంబర్‌పేటలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో గురువారం రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వి.హనుమంత రావు మాట్లాడుతూ.. జనాభాకు అనుగుణంగా రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు అందాలంటే సమగ్ర కులగణన జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించిందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో ఈ సర్వేను నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వి.హనుమంత రావుతో పాటు అంబర్‌పేట కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి హాజరయ్యారు. అంబర్‌పేట డీఎంసీ మారుతి దివాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో పాల్గొని ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు.