డ్రింక్స్ తాగే ముందు చీర్స్ ఎందుకు కొడతారో తెలుసా..?

by Kanadam.Hamsa lekha |
డ్రింక్స్ తాగే ముందు చీర్స్ ఎందుకు కొడతారో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: బర్త్ డే పార్టీ అయినా, పెళ్లి ఫిక్స్ అయినా, లవ్ ఫేల్యూర్ అయినా, ఇలా ఎన్నో సందర్భాల్లో ఏది జరిగిన పార్టీ చేసుకుంటారు. అయితే, డ్రింక్స్ తాగే ముందు చీర్స్ అనే పదం మనకు ఖచ్చితంగా వినబడుతుంది. ఈ పదాన్నే ఎందుకు వాడుతారు అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? దీని వెనుక పెద్ద స్టోరియే ఉంది.

చీర్స్ అనే పదం చియర్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఆనందం అని. పార్టీలు చేసుకొనే సమయంలో అందరూ కలిసి ఇలా చీర్స్ అని చెప్పడం వల్ల ఆ పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని అంటారు. ప్రస్తుతం కాలంలో మద్యం తాగడం అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ రోజుల్లో మద్యం సేవించడానికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏమి లేకుండానే ఎప్పుడు పడితే అప్పుడు మద్యం సేవిస్తున్నారు.

పూర్వం మధ్యయుగంలో దారి దోపిడి దొంగలు ఎక్కువగా ఉండేవారు. అయితే వీరు అందరూ కలిసి చేసిన దొంగతనం విజయవంతం అయితే.. అందరూ ఒక దీవి వద్దకు చేరుకొని అక్కడ మద్యం సేవించేవారు. అయితే వారిలో కొందరు వారు దొంగతనం చేసిన మొత్తాన్ని తమ సొంతం చేసుకోవడం కోసం మిగతావారి మద్యం గ్లాసులలో విషం కలుపుతారట. ఈ ఆలోచనని తిప్పి కొట్టేందుకు అందరూ చీర్స్ కొడతారు.

ఇలా చీర్స్ కొడితే విషం పోతుందా అని అనుకుంటున్నారా..? పోదు. అందరూ మద్యాన్ని గ్లాసులలో కలుపుకొని చీర్స్ కొట్టడం వల్ల ఆ గ్లాసుల్లోని మద్యం ఒకదానికొకటి తగిలి, ఒకరి గ్లాసులోని మద్యం మరొకరి గ్లాసుల్లో పడుతుంది. ఇలా పడటం వల్ల.. ఎవరైనా విషం కలిపితే అందరూ చనిపోతారని భయపడి ఎవ్వరూ విషం కలపకుండా ఉండేవారు. అది కాస్త కాలక్రమంగా దేశ విదేశాలకు వ్యాపించింది.

ఇది ఒక కారణం అయితే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా దీనిని చెప్పుకుంటారు. చీర్స్ కొట్టడం వల్ల అందరూ కలిసి ఉంటామనే భావన అందరిలో కలిగి ఒక యూనిటీగా ఉంటామని అంటారు.

Advertisement

Next Story

Most Viewed