- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మూసీ నుండి మమ్మల్ని రక్షించండి
దిశ, నల్లగొండ బ్యూరో : మూసీ పునరుజ్జీవ పాదయాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డిని మూసీ కాలుష్య రక్కసి నుంచి మమ్మల్ని కాపాడాలని ఆ ప్రాంత రైతులు,మత్స్య కార్మికులు తమ చేతులెత్తి వేడుకున్నారు. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నా రైతులు,మత్స్య కార్మికులను కలిసి మూసీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తాము ఆరు గాలం పండించిన పంటనే తాము తినలేని స్థితిలో ఉన్నామని వాపోయారు. చేపల వేట కోసం తాము వెళితే..తమకు రకరకాల చర్మ వ్యాధులు వస్తున్నాయని చర్మ బారిన పడిన మత్స కార్మికులు తమ చేతులను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లోని గడ్డిని మేసిన పాడి గేదెల నుంచి వచ్చిన పాలు సైతం కలుషితం అవుతున్నాయన్నారు. గత 40 సంవత్సరాల క్రితం మూసీ నుంచి పారే నీళ్లను దోసిల్లతో తాగేవాళ్ళమని.. ప్రస్తుతం మూసీ వాసన కూడా పీల్చలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. గత 30 40 సంవత్సరాల క్రితం పంటలు పండిన అనంతరం ఈ ప్రాంతంలోని రైతులందరం సంబరాలు చేసుకునే వాళ్ళమని, ప్రస్తుతం మూసి వేదజల్లే దుర్గంధంతో వెళ్లలేకపోతున్నామన్నారు. వరి నాట్లు వేసేటప్పుడు కూలీలు సైతం రావడం లేదన్నారు.కలకత్తా,బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చినప్పటికీ ఒకసారి వచ్చినోళ్లు మరోసారి రావడం లేదన్నారు. సంఘం ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభ వేదిక మీదికి ఎక్కిన వ్యక్తి తాము కుండలు చేసుకునేందుకు కనీసం మట్టి కూడా దొరకడం లేదన్నారు. ఈ ప్రాంతంలో చేసిన కుండలను మార్కెట్ కు తీసుకెళ్తే ..తమ ఊరి పేరు చెబితే కుండలు కొనడం లేదన్నారు. కులవృత్తి కోల్పోయి తమ కులస్తులందరూ వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు.