- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Korea Masters : టైటిల్ దిశగా కిరణ్.. సెమీస్‌కు దూసుకెళ్లిన యువ షట్లర్
దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ కిరణ్ జార్జ్ మెన్స్ సింగిల్స్ టైటిల్ దిశగా అడుగులు వేస్తున్నాడు. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కిరణ్ జపాన్ క్రీడాకారుడు టకుమా ఒబయాషిని ఓడించాడు. 39 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించిన కిరణ్ 21-14, 21-16 తేడాతో విజయం సాధించాడు.
గత రెండు మ్యాచ్‌లను కష్టంగా దాటిని కిరణ్ క్వార్టర్స్‌లో మాత్రంస్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌ను ఏకపక్షంగా దక్కించుకున్నాడు. అయితే, రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఆరంభంలో 7-3తో ముందున్నాడు. కానీ, జపాన్ ప్లేయర్ పుంజుకుని 8-8తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు పాయింట్ల కోసం పోటీపడగా 17-16 వద్ద కిరణ్ వరుసగా నాలుగు పాయింట్లు పొంది మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్ వేటలో కిరణ్ సెమీస్‌లో కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోనున్నాడు. టాప్ సీడ్, థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ విటిద్సర్న్‌తో తలపడనున్నాడు.