Cyber Crime Operation : కాంబోడియాలో భారీ సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్

by M.Rajitha |   ( Updated:2024-11-08 13:26:28.0  )
Cyber Crime Operation : కాంబోడియాలో భారీ సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : కంబోడియా(Cambodia)లో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు(Telangana Cyber Security Police) భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. ఎక్కువ జీతాలు ఇస్తామని తెలంగాణలోని యువకులను సైబర్ క్రైం ముఠా ముందుగా కాంబోడియాకు తరలిస్తూ.. అక్కడి నుంచి భారత్ లోని వివిధ ప్రాంతాల్లో సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నట్టు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. జగిత్యాలకు చెందిన ఓ బాధితుడి తల్లి ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు.. కంబోడియా వెళ్ళి మరీ ఈ భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఉద్యోగం కావాలని సదరు ముఠాతో మాట్లాడి, కాంబోడియాకు వెళ్ళి.. అక్కడ ఈ ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో కీలక నిందితుడు యూపీకి చెందిన సదాకత్ ఖాన్ ను అరెస్ట్ చేసి, ఇక్కడికి తీసుకువచ్చారు. ఉద్యోగాల కోసం చూస్తున్న యువకులకు భారీగా డబ్బులు ఆశజూపి, తీరా కాంబోడియాకు వెళ్ళాక వారి పాస్ పోర్ట్ లాక్కొని వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed