- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
DY Chandrachud: సీజేఐకి వీడ్కోలు పలికిన సుప్రీం ధర్మాసనం
దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud)కు సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది.ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు. దీంతో ఆయనకు ఇవాళే లాస్ట్ వర్కింగ్ డే కావడంతో సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా చివరి సందేశం ఇచ్చారు. వృత్తి పరంగా తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. ‘రేపటి నుంచి ఉన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేననేది నిజం. అయినప్పటికీ నేను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని తెలిపారు. కాగా, సీజేఐ చంద్రచూడ్ 2022 నవంబర్ 8 నుంచి ఈ పదవిలో ఉన్నారు.
సీజేఐగా చివరి తీర్పు..
కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్ తన లాస్ట్ వర్కింగ్‌డే రోజు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ(Aligarh Muslim University)కి మైనార్టీ హోదా విషయంలో కీలక తీర్పు వెలవరించారు. దీన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సీజేఐ నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది. మరోవైపు, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులయ్యారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇకపోతే, సంజీవ్ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.