మందారం పూలతో రెట్టింపు అందం.. ఏం చేయాలో తెలుసా?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-08 08:40:55.0  )
మందారం పూలతో రెట్టింపు అందం.. ఏం చేయాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: మందార పూలను పూజలో మాత్రమే కాకుండా పలు రకాల చర్మ సమస్యలకు కూడా ఉపయోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మందార పువ్వు చర్మంపై ఉన్న మొటిమలు, జిడ్డును తొలగించి స్కిన్‌ మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గించి, స్కిన్‌ను హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతేకాదు మందారం ఉండే గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటితో స్కబ్ ఎలా తయారు చేసుకోవాలో చేసేద్ధాం.

ముందుగా పువ్వులను ఎండబెట్టి పొడి చేసి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ పెరుగు, అర టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకొని ముఖంపై రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. దీంతో చర్మం మెరుస్తుంది. తదుపరి రెండు లేదా మూడు మందార పువ్వులను నీటిలో 1-2 గంటలు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మొక్కజొన్న పిండి, కొంచెం తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో నానబెట్టి ఉంచిన మందార నీళ్లను గిన్నెలో పోసి, ఐస్ క్యూబ్ ప్లేట్‌లో వేసుకొని ఫ్రీజ్ చేయాలి.

ఈ ఐస్ క్యూబ్‌ను ప్రతీ రోజూ మీ ముఖంపై ఆప్లై చేయండం వల్ల మీ ముఖం గ్లో అవుతుంది. ఇది ముఖంపై ఉన్న మొటిమలు కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.

మందారం- అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రెండు మందార పువ్వులను మెత్తగా గ్రైండ్ చేసుకొని, అందులో కలబంద జెల్‌ను కలిపి ఫేస్‌కి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

Advertisement

Next Story