పులిచింతలకు భారీగా వరద.. 13 గేట్లు ఎత్తిన అధికారులు

by Nagam Mallesh |
పులిచింతలకు భారీగా వరద.. 13 గేట్లు ఎత్తిన అధికారులు
X

దిశ, చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నాగార్జునసాగర్ వద్ద 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు అధికారులు 12 రేడియల్ గేట్లు 3 మీటర్లు, ఒక గేటు 2 మీటర్లు ఎత్తి క్రిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం 8 గంటల వరకు వరకు నీటి నిల్వ 42.16 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 170.011 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 3,00,698 క్యూసెక్కు లు కాగా, ప్రాజెక్టు రేడియల్ గేట్ల ద్వారా 3,11,041 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా ప్రాజెక్టు ఎడమవైపున ఉన్న విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. పులిచింతల విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యం 120 యూనిట్లు కాగా నాలుగు యూనిట్ల నుండి 84 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదన కోసం 16,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed