- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా : మాజీ ఎమ్మెల్యే జూలకంటి
దిశ, మిర్యాలగూడ : జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట సంతకాల చేపట్టారు. ఈ సందర్బంగా రంగారెడ్డి మాట్లాడుతూ సమాజానికి మూల స్తంభం జర్నలిజం అని, ఆ వృత్తిలో పనిచేసే విలేకరులకు సొంత ఇండ్లు కేటాయించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. జర్నలిస్టుల పట్లప్రభుత్వం సానుకూలంగా ఉండాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలిచ్చి పక్కాగృహాలు నిర్మించాలన్నారు.
బీఎస్పీ రాష్ట్రనాయకులు డాక్టర్ జే.రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు. వివిధ పార్టీలు ప్రజాసంఘాల ప్రతినిధులు తమమద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ఖాజా హామీదొద్దీన్, జిల్లా అధ్యక్షులు ఆయూబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. వెంకన్న, మహేష్, మంద సైదులు, జయరాజు, ఖాజా నజిమోద్దీన్, నరేందర్ రెడ్డి, రమేష్, రామకృష్ణ, అరుణ్, నాగేందర్, బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.