- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి మధ్య ఘర్షణ వాతావరణం
దిశ,తిరుమలగిరి : తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ పై నిరసన దీక్షలలో భాగంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని కాంగ్రెస్ బిఆర్ఎస్ వర్గాలు ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
కొన్ని వాహనాల కారు అద్దాలు పగిలిపోయాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. రాళ్ల దాడిలో పోలీసులకు సైతం గాయాలైనట్లు సమాచారం.దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించి టెంట్లు ఎత్తివేయించిన పోలీసులు అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని సమావేశం అయ్యారు.అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పదేళ్లలో సాధ్యం కానిది ఎనిమిది నెలల్లో చేసి చూపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని పేర్కొన్నారు. భారీగా మోహరించిన పోలీసుల పహారాలో తిరుమలగిరి ఎక్స్ రోడ్ ప్రాంతం ఉంది.