చౌటపల్లి ఊర చెరువు ఆక్రమణ.. పట్టించుకోని అధికారులు..

by Sumithra |
చౌటపల్లి ఊర చెరువు ఆక్రమణ.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, మఠంపల్లి : ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా గ్రామాల్లో మాత్రం రైతులకు ఉపయోగపడే చెరువులు మాత్రం ఆక్రమణకు గురివుతున్నాయి. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఉరచెర్వు అందజా 50 ఎకరాలు ఆక్రమణకు గురి ఐనది, సర్వేనెంబర్ 6 లో 20 ఇరవై ఎకరాలు, ఎఫ్టీఎల్ 574 సర్వేనెంబర్ లో 30 ఎకరాలు ఆక్రమణకు గురికాగా 25 ఎకరాల్లో ఆక్రమణ దారులు సేద్యం చేస్తున్నారు. గత నెలలో హుజుర్ నగర్ ఆర్డీఓకు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేశారు.

విషయం పై స్పందించిన ఆర్డీఓ డివిజనల్ సర్వేయర్ ను పంపించగ హద్దు రాళ్ళు కనిపించడం లేదని చెప్పి వెనుదిరిగి వెళ్ళటం జరిగింది. జిల్లా కలక్టర్ కు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని వెంటనే జిల్లాస్థాయి సర్వేయర్ తో సర్వే చేయించి ఆక్రమణకు గురి ఐన భూమిని కాపాడాలని ఆయకట్టు రైతులు కంచాల శ్రీనివాస్ రెడ్డి, మద్ది హుస్సేన్ రెడ్డి, వీరంరెడ్డి వీరారెడ్డి, తమ్మర శ్రీనివాస్ రెడ్డి, కొండేటి రామనర్సిరెడ్డి, గుండెపంగు చిన సైదులు, పెద సైదులు, కొమ్ము బాలకోటయ్య, గుండెపంగు స్వామి, యస్ కే.సర్ధార్ తదితరులు ప్రభుత్వ అధికారులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed