- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
S Jaishankar:ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతోంది- జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై విదేశాంగమంత్రి జై శంకర్ (Jaishankar) ప్రశంసలు కురిపించారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో జైశంకర్ పాల్గొని ప్రసంగించారు. ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆయన ఎన్నికతో ఆర్థిక, తయారీ రంగాల్లో అమెరికా మరిన్ని ప్రయోజాలు పొందుతుందని తెలిపారు. ప్రపంచీకరణ(globalisation) అంశంపై ఓటర్లలో ఉన్న అసంతృప్తి అమెరికా ఎన్నికల్లో కనిపించిందన్నారు. గ్లోబలైజేషన్ వల్ల ఇతర దేశాల కంటే అధికంగా చైనా (China) లబ్ధి పొందుతుందని ఆయన అన్నారు. క్లింటన్(Clinton) పరిపాలనలో మొదట దీన్ని పాటించారని పేర్కొన్నారు. అప్పట్లో దీనివల్ల యూఎస్, భారత్ సహా ఇతర దేశాల్లో అనిశ్చితి నెలకొందని వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశమయినప్పటికీ.. దానికి ప్రపంచ భాగస్వామ్య దేశాల మద్దతు అవసరమని అభిప్రాయం వ్యక్తంచేశారు.
దేశ భద్రత గురించి..
దేశ భద్రత గురించి జైశంకర్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత, జాతీయ భద్రతను విభజించలేమని అన్నారు. డిజిటల్, ఏఐ విప్లవంలో సాంకేతికతే కీలక భాగమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్నాయని.. భారత్ లో కూడా అదే ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో మళ్లీ ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదని తెలిపారు. అయినా, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ఎన్డీఏకు మూడోసారీ ఛాన్స్ ఇచ్చారన్నారు. వృద్ధి రేటును 7-8 శాతం కొనసాగించడం ఇతర దేశాలకు సవాలుగా మారిందని తెలిపారు. దీంతో, ప్రపంచదేశాలు భారతదేశ ఆర్థికవ్యవస్థ వైపు చూస్తుందన్నారు. భారత్‌లో వ్యాపారాలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.