- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మల్లొస్తాం లింగమయ్య.. ముగిసిన సలేశ్వరం జాతర

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతం లింగాల మండల పరిధిలోని కొండ కోనల మధ్య వెలసిన సలేశ్వరం లింగమయ్య జాతర గతమూడు రోజుల నుండి నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా భక్తులతో కిటకిటలాడుతూ లక్షలాది మంది భక్తులు లింగమయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రెజర్ టైగర్ ప్రాజెక్టు పేరుతో ఆంక్షలు విధిస్తూ జాతర ఉత్సవాలను కేవలం మూడు రోజులకే పరిమితం చేయడంతో భక్తులు అవస్థలు పడుతూ లింగమయ్య దర్శించుకున్నామని అటవీశాఖ అధికారుల పై పెదవి విరిచారు. అధికార యంత్రాంగం భక్తుల తాకిడిని అంచనా వేయడంలో విఫలం చెందారని తద్వారా భక్తులకు సలేశ్వరం రోడ్డు మార్గంలో అనేక అవస్థలు ఏర్పడ్డాయని.. ముమ్మాటికి అధికారుల అంచనా తప్పిదాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు లక్షలకు పైగా దర్శించుకున్న భక్తులు..
సలేశ్వరం జాతర ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు, అటవీ ప్రేమికులు దాదాపు గత మూడు రోజుల నుండి మూడున్నర లక్షలకు పైగా సలేశ్వరం అడవి మార్గం గుండా శంభో శంకర వస్తున్నాం లింగమయ్య వస్తున్నాం.. మల్లొస్తాం లింగమయ్య.. మల్లోస్తామంటూ కొండలు, గుట్టలు, లోయలు, వంకలు దాటుతూ తెలంగాణ అమరనాథ్ గా పిలువబడుతున్న సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలు భక్తులతో కిటకిటలాడుతూ జనసంద్రంగా మారిన సలేశ్వరం దారి.
దర్శనానికి 9 గంటలకు పైగా పడిగాపులు...
దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులు కాలినడకతో నడుస్తూ.. జనసంద్రంగా భక్తజన ఉండడంతో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే దాదాపు 9 గంటలకు పైగా భక్తులు పలుచోట్ల గంటల తరబడి నిలబడి ఆ లింగమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు ఒత్తిడి పెరగడం వలన క్యూలైన్లో భక్తులు అవస్థలు పడ్డారు. అయినప్పటికీ ఎంత కష్టమైనా ఓర్చుకొని భక్తులు దర్శించుకున్నారు.
మల్లొస్తాం లింగమయ్య అంటూ...
సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలు నేటితో ముగియడంతో లింగమయ్యను దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు తిరుగు ప్రయాణంలో మల్లోస్తాం లింగమయ్య అంటూ దారి పొడవునా దగ్గరగా కేకలు వేస్తూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ జాతర వేడుకల సందర్భంగా పోలీసులు, అటవీశాఖ, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. అటవీ శాఖ అధికారులు ఆదివారం సాయంత్రం 6 గంటలకు సలేశ్వరం వెళ్లేందుకు వాహనాలకు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.