అజిత్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్.. నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్

by Hamsa |   ( Updated:2025-04-28 15:26:54.0  )
అజిత్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్.. నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ భూషణ్ అవార్డుల ప్రదానం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ప్రధాని మోడీ(Prime Minister Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan) హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రహీతలు అవార్డులు అందుకున్నారు. ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ(Balakrishna), అజిత్‌(Ajith Kumar), డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈక్రమంలో.. తాజాగా, హీరోయిన్ హీరా రాజగోపాల్(Heera Rajagopal) తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ‘‘ఓ నటుడు నాకు ద్రోహం చేశాడు. అంతేకాకుండా నా గురించి తప్పుగా మాట్లాడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశాడు.

అతని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు అవమానం పాలయ్యాను. అయితే ఒకసారి అతనికి వెన్నెముకకు గాయమైతే సర్జరీ చేయించుకున్నానని అన్నాడు. దీంతో నాకు చాలా బాధ అనిపించింది. ఆ సమయంలో అతనితోనే ఉండి సేవలు చేశాను. అతని బెడ్‌ప్యాన్‌లను మార్చడంతో సహా అన్నీ నేను చూసుకున్నాను. కానీ అతను మాత్రం నాకు ఆరోగ్యం విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడని తర్వాత తెలిసింది. నటుడి నేరం - అపనిందలు, అపవాదు, సమాజాన్ని వెలికితీయడం. అతని అభిమానులను హింసకు గురిచేయడం. నా గౌరవం, చిత్తశుద్ధి, తెలివి మరియు భద్రతపై క్షమించరాని దాడులను ప్రోత్సహించడానికి రూపొందించిన ధిక్కార అబద్ధాలు నన్ను నిరాశకు గురి చేశాయి. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు అజిత్ గురించే అని చర్చించుకుంటున్నారు. హీరా కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.



Next Story

Most Viewed