- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
APCC: షెడ్యూల్ విడుదల కాకముందే వారికి న్యాయం చేయండి.. వైఎస్ షర్మిల ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2, డిప్యూటీ ఈవో(Group 2 and Deputy EO) పోస్టుల ఎంపికలో అనుసరించిన విధానాన్నే గ్రూప్-ల పోస్టులలో కూడా పాటించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress President) వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. ఉద్యోగ అభ్యర్థుల సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల(Group 1 Candidates) పక్షాన మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)ని విజ్ఞప్తి చేస్తున్నామని, గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని, గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే జీవో నంబర్ 5(GO 5) ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీ(APPSC)కి ఉందని, ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందని స్పష్టం చేశారు.
అంతేగాక 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్ కి అర్హత పొందారని, 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నట్లు తెలిపారు. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్ళీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఇక ఏపీపీఎస్సీ ఛైర్మన్ని కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.