- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాట్సాప్‌లో పెళ్లి శుభలేఖలు ఓపెన్ చేస్తున్నారా..? ఇక మీ డబ్బులు గోవిందా..!
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్‌లో మనకి చాలామంది అనేక డాక్కుమెంట్లు, ఫోటోలు, పెళ్లి శుభలేఖలు షేర్ చేస్తూ ఉంటారు. వాటిని రిసీవ్ చేసుకున్నావరు డౌన్‌లోడ్ చేసుకుంటుంటారు. కానీ ఆ డాక్యుమెంట్లు పంపింది మనవాళ్లు, తెలిసిన వాళ్లైతే ఓకే.. కానీ మనకు తెలియని, ఏ మాత్రం పరిచయం లేని అన్‌నోన్ పర్సన్స్ నుంచి వచ్చిన పెళ్లిపత్రికల్లాంటి డాక్యుమెంట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో డౌన్‌లోడ్ చేయొద్దని, కనీసం క్లిక్ కూడా చేయొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఒకవేళ తెలిసో, తెలియకో వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారంటే.. క్షణాల్లో మీ అకౌంట్లలో డబ్బులు ఖాళీ అయిపోతాయని హెచ్చరిస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ మధ్య డిజిటల్ ఆహ్వాన పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే ప్రాంతాన్ని సూచించే గూగుల్ మ్యాప్స్ లింక్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డాక్యుమెంట్లు, వీడియోలు, అనేక లింకులు మొత్తం వాట్సాప్‌లోనే షేర్ చేసుకుంటున్నాం. అయితే కొంతమంది సైబర్ నేరగాళ్లు దీన్నే అదనుగా తీసుకుని మన ఫోన్లకు మాల్వేర్‌ను ఫీడ్ చేసిన పెళ్లి పత్రికలు, డాక్యుమెంట్లు, లింకులు పంపిస్తున్నారు. ఒకవేళ మనం పెళ్లి పత్రిక ఎవరు పంపారో చూద్దామనే కుతూహలంతో కానీ, లేదంటే ఈ లింక్ ఏంటా..? అనే ఆసక్తితో కానీ దానిపై క్లిక్ చేశామంటే అంతే సంగతులు. మన ప్రమేయం లేకుండానే ఫోన్‌లోకి హిడెన్ యాప్స్ డౌన్‌లోడ్ అయిపోతాయి. వీటి ద్వారా మన గ్యాలరీ, యాప్‌లలోని మొత్తం డేటాతో పాటు అన్ని రకాల ఫోన్ పర్మిషన్స్ ఈ మాల్‌వేర్ దానంతట అదే హ్యాక్ చేసి మెయిన్ సర్వర్‌ని రన్ చేస్తున్న హ్యాకర్‌కి పంపుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫోన్ మన చేతుల్లోనే ఉన్నా.. దాని కంట్రోల్ పూర్తిగా సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తిపోతుంది. దీంతో మన వ్యక్తిగత ఫొటోలు, పర్సనల్ డేటా కొట్టేసి వాటితో బ్లాక్‌మెయిలింగ్‌కి దిగుతారు. అలాగే మన డిజిటల్ వేలెట్ పాస్‌వర్డ్‌లు, ఫోన్ పే, గూగుల్ పే ఎంపిన్‌లు కూడా సేకరించి.. వాటి ద్వారా ఇక దర్జాగా మన అకౌంట్లలోని డబ్బులన్నీ కాజేస్తారు సైబర్ నేరస్తులు. కాబట్టి ఇకపై డిజిటల్ డాక్యుమెంట్లపై క్లిక్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి.