- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Credit card insurance: అదనపు ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులు(Credit cards) వాడుతున్నారు. చేతిలో మనీ లేని సందర్భాల్లో ఈ కార్డులు ఉపయోగపడతాయి. కొనుగోళ్ల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. కానీ క్రెడిట్ కార్డుల్లో అనేక ఉపయోగకరమైన ఫీచర్స్ ఉంటాయని చాలా మందికి తెలిసుండదు. క్రెడిట్ కార్డులు కూడా పలు రకాల ఇన్సూరెన్స్‌లు ఇస్తాయి. పైగా ఎక్స్ట్రా ఛార్జీలు(Extra charges) కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. కార్డు హోల్డర్ కావడం వల్ల ఆటోమేటిట్గా ఈ ఇన్సూరెన్స్ సైతం కవర్ అవుతుంది. క్రెడిట్ కార్డు అందించే బీమా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వినియోగదారుడు కవరేజీకి సమానమైన మొత్తాన్ని పొందేలా చేస్తుంది.
సాధారణ క్రెడిట్ కార్డులో లభించే బీమాలు..
సాధారణ క్రెడిట్ కార్డుల్లో అయితే ట్రిప్ క్యాన్సిల్ లేదా ఏదైనా అంతరాయం కలిగినట్లైతే.. నాన్ రిఫండబుల్(Non-refundable) ఖర్చులను రీయింబర్స్(Reimbursement)చేస్తుంది. ఉదాహరణకు అనారోగ్యం, తీవ్రమైన వాతావరణం. మీ ప్రయాణం గంటల్లో లేట్ అయితే వసతి భోజనం(Accommodation meals), రవాణా(transportation) వంటి ఖర్చులను కవర్ చేస్తుంది.
జర్నీ సమయంలో లగేజీ డ్యామేజ్ అయితే..
ప్రయాణ సమయంలో వస్తువులు ఎవరైనా దొంగిలిస్తే(Istolen) లేదా డ్యామేజీ(Damage) అయితే లగేజీకి ఈ బీమా కవర్ తో మనీ వస్తుంది. విదేశాల్లో హెల్త్ సమస్యతో బాధపడితే కూడా వైద్య ఖర్చులు ఉంటాయి. ప్రమాదవశాత్తు ఏదైనా గాయమైన డబ్బు లభిస్తుంది.
క్రెడిట్ షీల్డ్ ఇన్సూరెన్స్...
కార్డుదారుడు చనిపోతే(die) ఇప్పటికే ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించడం సవాలుగా ఉంటుంది. కాగా ముందుగా నిర్ణయించిన పరిమితి ప్రకారం క్రెడిట్ కార్డులను వాడటం వల్ల కలిగే రుణాలను క్రెడిట్ ఇన్సూరెన్స్(Credit Insurance) చెల్లిస్తుంది.అలాగే యాక్సిడెంట్ అయితే కార్డుదారుడికి 5 లక్షల రూపాయల నుంచి రూ. 10 లక్షల వరకు ఎక్స్ట్రా పమాదబీమా కవరేజీ(Extra accident insurance coverage)ని అందిస్తుంది.
ఇలా.. ఫ్రాడ్ ప్రొటెక్షన్(Fraud Protection), మొబైల్ ఇన్సూరెన్స్(Mobile Insurance),రిటర్న్ ప్రొటెక్షన్(Return Protection), ఎక్స్‌టెంటెడ్ వారంటీ(Extended Warranty), పర్చేజ్ ప్రొటెక్షన్(Purchase Protection) లాంటి బీమాలు సాధారణ క్రెడిట్ కార్డు ద్వారా లభిస్తాయి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక వైద్య నిపుణులను సంప్రదించగలరు.