Snake bit: పాముతో నుదుటిపై కరిపించుకున్నాడు..ఎందుకో చూడండి!

by Y. Venkata Narasimha Reddy |
Snake bit: పాముతో నుదుటిపై కరిపించుకున్నాడు..ఎందుకో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా జనం పాము(snake) కనిపిస్తేనే హడలిపోతుంటారు. అలాంటిది ప్రాణాంతకంగా ఓ వ్యక్తి పాముతో నుదుటిపై కరిపించుకుని(Snake bit)వీడియో రిలీజ్ చేయడం వైరల్(viral)గా మారింది. ఇంతకు అతడు అలా ఎందుకు చేశాడంటే ఆ పాముల జాతి సంరక్షణ కోసమని చెబుతున్నాడు. వివరాల్లోకి వెళితే ఇండోనేషియాకు చెందిన జెజాక్ సి ఆడెన్ పాముల సంరక్షణకు పాటుపడుతుంటాడు. అక్కడి జావా దీవుల్లో పచ్చరంగు బురద పాములు ప్రమాద రహితమైనప్పటికీ స్థానికులు వాటిని చంపేస్తున్నారు. దీంతో జనంలో వాటి సంరక్షణపై అవగాహన పెంచడం కోసం జెజాక్ సి ఆడెన్ పాముతో నుదుటిపై కరిపించుకున్నారు. అతడిని కరిచే క్రమంలో ఆ పాము కొన్ని నిమిషాలు నుదుటిని తన కోరలతో గట్టిగా పట్టుకున్న దృశ్యం చూసేందుకు ఒళ్లు జలదరించేలా ఉంది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed