బ్రోకలి క్యాన్సర్‌కు చెక్ పెడుతుందా..? అధ్యయనాలు ఏం చెబున్నాయంటే..!

by Kanadam.Hamsa lekha |
బ్రోకలి క్యాన్సర్‌కు చెక్ పెడుతుందా..? అధ్యయనాలు ఏం చెబున్నాయంటే..!
X

దిశ, ఫీచర్స్: రోజువారి ఆహారంలో భాగంగా పోషకాలు ఉన్న కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, వీటిలో కొన్ని ఆహారాలు క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. క్యాబేజీ, క్యాలిఫ్లవర్ లాంటిదే ఈ బ్రోకలి. ఇందులో విటమిన్-సి, కాల్షియం, యాంటీఆక్సిడెంట్సు, విటమిన్-కే, విటమిన్-ఎ, ఫైబర్ వంటి మరెన్నో ఖనిజాలతో కూడిన కూరగాయ. రోజువారి ఆహారంలో భాగంగా బ్రోకలిని తీసుకుంటే.. క్యాన్సర్‌ను అదుపుచేస్తుందని ఒరెగాన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బ్రోకలి మొలకల్లో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం యాంటీ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది.

నార్ఫోక్ శాస్త్రవేత్తలు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల ఎక్స్‌రేలలో కొన్ని అసాధారణ సంకేతాలను కనుగొన్నారు. రోజు వారి ఆహారంలో భాగంగా ఒక కప్పు బ్రోకలి మొలకలను తిన్న తరువాత వారిలో అసాధారణ కణాల పెరుగుదల నియంత్రణలోకి వచ్చినట్లు అధ్యయనంలో తెలిపారు. ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్‌ను తగ్గించే పదార్థాలు కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే, బ్రోకలి.. క్యాన్సర్‌పై ఎంత ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరింత లోతైన అధ్యయనం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

క్యాన్సర్‌ను ఎలా నియంత్రిస్తుంది:

జన్యువులో ఫాస్పెటేస్, టెన్సిన్ హోమోలాగ్ లోపించడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ విస్తరిస్తుంది. బ్రోకలి ఆకుల్లో సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది డీఎన్‌లోని మ్యూటేషన్స్‌ను నియంత్రించి, క్యాన్సర్‌‌ను తగ్గిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళలు బ్రోకలిని రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటే వారిలో అదనంగా ఉన్న క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. పొట్ట, జీర్ణక్రియలోని సమస్యలను నియంత్రించడంలో బ్రోకలి సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్, ప్రేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది.

అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించే పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని దూరం చేసి, ప్రేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Advertisement

Next Story