- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సబ్ కా సాత్... సబ్ కా వికాస్....ఎన్డీఏ కూటమితోనే సాధ్యం
దిశ,భైంసా : సబ్ కా సాత్...సబ్ కా వికాస్, బాల్ ఠాక్రే ఆశయాలు ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా నాందేడ్ జిల్లా డెగ్లూర్, పాలజ్ లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. శివాజీ, అంబేద్కర్ పుట్టిన గడ్డపై అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఎన్డీఏ పాలనలో గత 10 సంవత్సరాలుగా సుఖన్య సమృద్ధి, పీఎం కిసాన్ లాంటి ఎన్నో పథకాలు, రోడ్లు, భవనాలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.
మోడీ పాలనలో దేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందన్నారు. బోకర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయ చౌహాన్ ని, సంతుక్రవ్ అంబార్డేని ఎంపీగా గెలిపించాలన్నారు. మహారాష్ట్రలో రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేసే వాళ్లు ప్రజలను విడగొట్టి బలహీన పరచాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా కుబీర్ మండలానికి మూడు కిలోమీటర్లలోని పాలజ్ లో నిర్వహించిన సభకి తెలుగు అభిమానులు భారీగా హాజరయ్యారు. సాయంత్రం లాతూర్ సభ, రాత్రి షోలాపూర్ నగరంలోని రోడ్ షో లో పవన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.