- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి(Ap Cm Chandrababu Naidu) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు(Rammurthy Naidu) మృతి చెందారు. దీంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు సొంత గ్రామం నారావారిపల్లె(Naravaripalle)లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏఐజీలో ఉన్న రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు తరలించాలని నిర్ణయించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆదివారం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో నారా, నందమూరి కుటుంసభ్యులు ఆదివారం నారావారిపల్లెకు వెళ్లనున్నారు.
కాగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తినాయుడు మృతి చెందారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని నారా, నందమూరి కుటుంబసభ్యులు సందర్శించారు. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు.. సోదరుడి మృతిపై ఎమోషనల్ అయ్యారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు తమను విడిచివెళ్లిపోయారని, తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపారని చంద్రబాబు భావోద్వేగం వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.