- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP: తమ్ముడు మనల్ని విడిచి వెళ్లిపోయాడు.. తమ్ముడి మృతి పట్ల సీఎం చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సోదరుడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే(former Chandragiri Constituency MLA) నారా రామ్మూర్తి నాయుడు(Nara Rammurthy Naidu) ఇవాళ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు తన పర్యటనలు రద్దు చేసుకొని హుటాహుటిన హైదారాబాద్ చేరుకున్నారు. ఐఏజీ ఆసుపత్రిలో ఉన్న తన తమ్ముడి పార్థివదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తమ్ముడితో తీయించుకున్న పాత చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. భావోద్వేగబరిత వ్యాఖ్యలు(Emotional Comments) చేశారు. దీనిపై నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయం(Heavy Heart)తో అందరికి తెలియచేస్తున్నానని చెప్పారు. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడని తెలిపారు. అలాగే మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని(Great Sadness) నింపాడని విచారం వ్యక్తం చేశారు. ఇక ఆయన ఆత్మకు శాంతి(Rest In Peace) కలగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఎక్స్ లో రాసుకొచ్చారు.