- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దిశ’ ఎఫెక్ట్.. పంట చేను ధ్వంసం చేసిన ఘటనపై పోలీసుల విచారణ
దిశ, ఆలేరు : ఆలేరు మండలం మంతపురి గ్రామ రెవెన్యూ శివారులోని వరి పంట చేను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దిశ దినపత్రిక ప్రధాన సంచికలో శుక్రవారం "పంట చేను ధ్వంసానికి ఆలేరు పోలీసుల సపోర్టు?" అనే శీర్షిక కథనం ప్రచురణ చేసింది. దిశ కథనానికి స్పందించిన పోలీసు ఉన్నత అధికారులు వెంటనే సంఘటన జరిగిన విషయమై విచారణ చేయాల్సిందిగా ఆలేరు పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. పై అధికారుల సూచన మేరకు ఆలేరు ఏఎస్ఐ అంజయ్య నేతృత్వంలో శుక్రవారం మంతపురి గ్రామంలో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి విచారణ చేశారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల, బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.వరి పంట ధ్వంసం అయిన పొలాలను పరిశీలించారు.గురువారం రాత్రి బాధితురాలు సిహెచ్ లక్ష్మి తన వరి పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆలేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.