‘తిరగబడ్డ పులిబిడ్డ’ గీతాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి

by Disha Web Desk 9 |
‘తిరగబడ్డ పులిబిడ్డ’ గీతాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, మర్రిగూడ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాటను గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరగబడ్డ పులిబిడ్డ సబ్బండ వర్గాలకు బహుజన రాజ్యం కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి, అందరికీ స్వేచ్ఛ సమానత్వాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈయనపై ఇలాంటి పాటలు చిత్రీకరించి ప్రజలు ముందుకు తీసుకొచ్చిన గాయకుడు చేల్లం పాండురంగారావును అభినందించారు. వెలివాడలో పుట్టిన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొంది అణగారిన జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్ల పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా చట్టసభల్లో అందరికీ అవకాశాలతో పాటు సమాన న్యాయం అంటరానితనం రూపుమాపడం కోసం తన కుటుంబాన్ని పక్కనపెట్టి రాజ్యాంగం రచన కోసం ఆయన చేసిన కృషి అమోహమని తెలిపారు.

ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని అన్నారు. ఆయన చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు. మహనీయుని అడుగుజాడల్లో ప్రభుత్వం నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంబేద్కర్ గారికి నివాళులర్పించారు. పీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు అంబేద్కర్ పాటలతో పాటు సమాజ మార్పు కోసం మరెన్నో చైతన్యవంతమైన పాటలను ముందుకు తీసుకొచ్చి, సమాజ మార్పు కోసం తన వంతుగా కృషి చేయాలని చెప్పుకొచ్చారు. సమాజంలో సమాజ స్పృహ కలిగి ఇలాంటి వారు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం, గతంలో 10వ తరగతి విద్యార్థులకు కూడా మంచి ఫలితాల కోసం స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయమని అన్నారు.

భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ పాటను రచించిన అమరజీవి నిస్సార్ గారు రచన ద్వారా వచ్చిన పాటను సమాజానికి పరిచయం చేయడం పాండురంగ రావు గారిని అభినందించదగ్గ విషయమని ఆయన అన్నారు. కుల మత బేధం లేకుండా మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఆదర్శమూర్తి తిరగబడ్డ పులిబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కరని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ ప్రజానాట్యమండలి, నల్లగొండ జిల్లా కార్యదర్శి, ప్రజా నాయకులు చేల్లం పాండురంగారావు, గుండాల అజయ్ కుమార్, కొట్టం శ్రీనివాస్, చేల్లం చింటూ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed