- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటలెక్కువ, చేతల తక్కువ: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబుకు(CM Chandrababu) మాటలెక్కువ అని, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) ఎద్దేవా చేశారు. జనవరి కల్లా రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని అధికారులు సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఆయన విమర్శలు చేశారు. ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం, ప్రక్రియ అని తెలిపారు. దాన్ని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్(Vizag Steel)పై మాత్రం సీఎం చంద్రబాబు నోరు మెదపడటం లేదని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లేలా కార్మికులను, సంఘాలను చంద్రబాబు తప్పుబడుతున్నారని చెప్పారు. తన తుప్పు బట్టిన ఆలోచనలకి ఉచిత గ్యాస్(Free Gas) లబ్ధిదారుల్లో అరకోటి మందికి ఎగనామం పెట్టడం తెలుసు గానీ.. వైజాగ్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎక్కడ ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
చంద్రబాబుకు మాటలెక్కువ, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారు..
ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం/ప్రక్రియ. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు…