- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన డీసీసీబీ డైరెక్టర్ రంగాచారి
దిశ, చింతలపాలెం: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు హుజూర్ నగర్ నియోజకవర్గ జేఏసీ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ వేములూరి రంగా చారి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న రంగాచారి.. హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే ఒక క్రియాశీల నాయకుడిగా.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ (jac) చైర్మన్‌గా ఎన్నో ఉద్యమాలను చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులలో ఒకరిగా పేరుగాంచారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్నది. కాబట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో.. ఇటువంటి నాయకులు చేరడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని అన్నారు. ఆయన వెంట గుడిమల్కాపురం మూడో వార్డు మెంబర్ గంగారపు రాముడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపాలెం కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి ఇంద్రారెడ్డి, దేవి రెడ్డి లక్ష్మారెడ్డి, నాగార్జున రెడ్డి, ప్రసాద్, బాలు, కోట్య, మహేష్, రాజు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.