ప్రమాదకరంగా ద్వారకుంట రహదారి

by Naveena |
ప్రమాదకరంగా ద్వారకుంట రహదారి
X

దిశ, కోదాడ : కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట వెళ్లే రహదారి వరదలతో ప్రమాదకరంగా మారింది. గత 50 రోజుల క్రితం వచ్చిన వరదలకు 65 నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న సర్వీస్ రోడ్డు కొంతమేర కొట్టుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోదాడ నుంచి గ్రామంలోకి రావడానికి ఇదే ప్రధాన మార్గం కావడంతో.. రహదారిపై రద్దీ పెరిగిపోయింది. వరదలు వచ్చి 50 రోజులు పైగా గడుస్తున్న.. అధికారులు ,ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్డు కొంతమేరకు కొట్టుక పోయినా అక్కడ ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. వాహనాలు అతివేగంగా వస్తే ప్రమాదానికి కచ్చితంగా గురవుతారని స్థానికులు తెలుపుతున్నారు. రాత్రి వేళల్లో కరెంటు పోయినప్పుడు..ఈ రహదారి గుండా వెళితే.. కచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందాని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. రహదారిని పునరుద్ధరించాలి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed