- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చప్పట్లతో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఆదివారం నిరవధిక సమ్మెకు సంఘీభావంగా టి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరామ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ దామెరా శ్రీనివాస్, జానకిరాములు, కిషన్ ప్రసాద్, పర్వతాలు, టిపిటి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరాస్వామి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, వినోద్ కుమార్, వినయ్, మనోహర్ సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ..ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, సరస్వతి, తేజ శ్రీ, సునీత, నీల,మహేశ్వరి,రంగారావు,మురళి,కవిత, ఉపేందర్, రాజీవ్, కల్పన, పద్మ, సఫియా, ఫయాజ్, వీరాస్వామి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.