- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచానికి గిరిజన సంస్కృతి తెలిసేలా ఏర్పాట్లు
దిశ, భద్రాచలం టౌన్ : ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసి గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారి సంస్కృతి సాంప్రదాయాలు భద్రాచలంకు వచ్చే భక్తులకు తెలియజేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాల పక్కన టూరిజం స్పాట్ గా నిర్మిస్తున్న రివర్ సైడ్ క్యాంపెనింగ్, గిరిజన కల్చర్ స్టాల్స్ ఏర్పాట్ల పనులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9, 10 తేదీలలో జరిగే సీతారామచంద్రస్వామి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున ఈ జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలు పర్యాటక దర్శనీయ స్థలాలు తెలిసే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా గోదావరి కరకట్ట ప్రదేశాలలో రివర్ ఫెస్టివల్ తరహాలో భక్తులకు కనువిందు కలిగేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వచ్చిన భక్తులు వసతి కోసం అన్ని సౌకర్యాలతో ట్రైబల్ కు సంబంధించిన పాతకాలపు నివాసాలు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన సాంప్రదాయమైన వివిధ రకాల నృత్యాలతో పాటు వంటకాలు, వెదురు క్రాఫ్ట్స్ కళాఖండాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం గిరిజన కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, టూరిస్టులు సరదాగా సేదతీరి ఫొటోలు దిగడానికి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన వంటకాలు, తేనె మరియు తాటి బెల్లం, రాగి జావ, జొన్న జావా వివిధ రకాల న్యూట్రిషన్ కి సంబంధించిన ఆహార పదార్థాలు గిరిజనులు అమ్ముకొని ఉపాధి పొందడానికి 40 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని 8వ తేదీన ప్రారంభించనున్నట్టు చెప్పారు.