Eluru: భగ్గుమన్న పాత కక్షలు.. ఉద్రిక్తత

by srinivas |
Eluru: భగ్గుమన్న పాత కక్షలు.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District)లో ఒక్కసారిగా పాత కక్షలు భగ్గుమన్నాయి. ద్వారకాతిరుమల మండలం గుండుగోలగుంట(Gundugolgunta)లో రెండు వర్షాలు ఘర్షణ(Clash)కు దిగారు. కర్రలు, రాళ్లలతో పరస్పరం దాడులు(Attacks) చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు ఘర్షణకు కారణమైన ప్రధాన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో పికెటింగ్(Picketing) ఏర్పాటు చేశారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed