ఆదర్శ రామగుండంగా తీర్చిదిద్దుతా

by Sridhar Babu |
ఆదర్శ రామగుండంగా తీర్చిదిద్దుతా
X

దిశ, గోదావరిఖని : రామగుండానికి పూర్వ వైభవం తీసుకువచ్చి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 300 కోట్ల నిధులు తీసుకువచ్చి పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. కొంతమంది ఓర్వలేక అసత్యపు మాటలు మాట్లాడుతున్నారని, నోరు ఉన్నట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులే ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చాలని గత పది సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని దుయ్యబట్టారు.

మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు సింగరేణి కంపెనీ ఇచ్చిందని తెలిపారు. కచ్చితంగా పనిచేస్తానని, ఈ ప్రాంతానికి రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉండేలా తయారు చేస్తామన్నారు. సింగరేణి భూములు ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తే చూస్తూ ఊరుకోమంటారా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కొన్ని స్థలాలను తీయక తప్పదు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, రవికుమార్, దీటి బాలరాజ్, బాలరాజ్ కుమార్, చుక్కల శ్రీనివాస్, పక్రుద్దీన్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed