- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైక్ పై వచ్చి సెల్ ఫోన్ చోరీ
by Sridhar Babu |
X
దిశ, బోథ్ : మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో నిగిని గ్రామానికి చెందిన బాపూరావు అనే వ్యక్తి నుండి దుండగులు సెల్ ఫోన్ లాక్కొని పరారీ అయ్యారు. బస్టాండ్ లో అందరూ చూస్తుండగానే నెంబర్ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు బాపూరావు చేతిలో నుండి సెల్ ఫోన్ బలవంతంగా లాక్కొని పరారీ అయ్యారు. మోటార్ సైకిల్ పై వచ్చిన వీరు కొద్దిసేపు బస్టాండ్ లో అటు ఇటు తిరిగి సెల్ ఫోన్ లాక్కొని పరారీ అయినట్లు బాధితుడు తెలిపాడు. అయితే వచ్చిన వ్యక్తుల వద్ద గొడ్డలి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల సెల్ ఫోన్ పోయిన వ్యక్తుల ఖాతాలో నుండి డబ్బులు కూడా మాయమవుతుండడం మండలంలో తీవ్ర చర్చనీయంగా మారింది.
Advertisement
Next Story